
నేపాల్ లో బీభత్సం సృష్టించిన వరదలకు భూకంపమే కారణమని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. భూకంపం ధాటికి మంచు పర్వతం కూలడంతోనే ఆకస్మిక వరదలు వచ్చి 55 మంది చనిపోయారని తెలిపింది. 400 మంది కైలాస్ మానస సరోవర్ యాత్రికులు గల్లంతు కాగా, అందులో 133 మంది భారతీయులున్నారు. ఆ వరదలు దిగువన గల మన బిహార్ ను ముంచెత్తే ప్రమాదముందంటూ కేంద్రం హెచ్చరించింది.
బిహార్ సీఎం సామ్రాట్ చౌధురికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. నేపాల్ ఉత్తర ప్రాంతంలోని రసువా జిల్లాలో ఇళ్లు, వాహనాలు, వంతెనలు, మౌలిక సదుపాయాలన్నింటినీ వరదనీరు తుడిచిపెట్టేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ప్రకృతి ప్రకోపిస్తే ఎలాంటి ఉత్పాతం జరుగుతుందో నేపాల్ ఘటన కళ్లకు కట్టింది.