
రూ.100 కోట్లు వసూలు చేసి రూ.200 కోట్ల దిశగా దూసుకెళ్తున్న ‘ఇరుముడి’ సినిమాపై రాంచరణ్ ప్రశంసలు కురిపించారు. నాగార్జున, విజయ్ దేవరకొండ, రష్మిక వంటి స్టార్లు.. రవితేజ నటించిన ‘ఇరుముడి’ని అభినందనల్లో ముంచెత్తగా, ఇప్పుడు రాంచరణ్ వారికి జతకలిశారు. ఏటా అయ్యప్ప దీక్ష తీసుకునే ఆయన.. డైరెక్టర్ శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మరిన్ని హిట్లు కొట్టాలని ఆకాంక్షిస్తూ చివర్లో స్వామి శరణం అంటూ ట్వీట్ చేశారు.
రవితేజ-మూవీ టీమ్ పడ్డ కష్టానికి ఈ ప్రశంసలు కచ్చితంగా అర్హమైనవంటూ పొగిడారు. తండ్రి, కూతురు సెంటిమెంట్ కు 41 రోజుల అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడిస్తూ ఈ చిత్రం తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో తీసిన టాక్సిక్ సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే, ‘ఇరుముడి’ మాత్రం దుమ్మురేపుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.