
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ సినిమాకు అన్ని వర్గాల నుంచి నెగెటివ్ టాక్ వినపడుతోంది. కానీ వసూళ్లు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.254.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. హింసాత్మక, రొమాంటిక్ సన్నివేశాలు మహిళల్ని కించపరిచేలా ఉన్నాయన్న విమర్శలున్నా కలెక్షన్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. శుక్రవారంతో పోలిస్తే శనివారం వసూళ్లు తగ్గినా టోటల్ రాబడికి ఢోకా లేకుండా పోయింది.
ఈనెల 26న విడుదల కాగా, తొలిరోజే విపరీతమైన నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందించిన ఈ సినిమా మొదటిరోజు నాడే రూ.100 కోట్లు రాబట్టి తర్వాత మందగించింది. అయితే కన్నడ థియేటర్ల ఆక్యుపెన్సీ 40 శాతం యష్ సినిమాదే కావడం అతడికున్న క్రేజ్ ను తెలియజేస్తోంది.