
జీడీపీ వృద్ధి రేటు 7.8%గా నమోదవడమే తమ పనితనానికి నిదర్శనమంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కౌంటరిచ్చారు. ఇరాన్ యుద్ధం, ప్రపంచ అనిశ్చితులు దేశ ఆర్థిక వ్యవస్థపై భారం మోపవచ్చనే ఆందోళనల నడుమ ఊహించిన దానికంటే ఎక్కువ వృద్ధి నమోదైందన్నారు. ” ప్రపంచం యుద్ధంలో మునిగిపోయింది.. నలువైపులా యుద్ధ వార్తలే.. ప్రపంచం సంక్షోభాలతో చుట్టుముట్టుకుని ఉంది.. చైన్ సప్లయ్ పూర్తిగా తెగిపోవడంతోపాటు 2020 కొవిడ్ కాలం నుంచి నేటి వరకు ఎక్కడా స్థిరత్వం లేదు.. అయినా ఈ పరిస్థితుల్లో భారతదేశం వేగంగా పురోగమిస్తోంది.. భారీ వృద్ధితో దేశం ఆనందంతో నిండిపోయింది.. ప్రజలకు అభినందనలు.. వారి సంకల్పబలం, కృషికి నేను అభినందనలు తెలియజేస్తున్నా.. ” అన్నారు.