
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిర్వహిస్తున్న గట్టి నిఘా వల్ల భారీగా బంగారం పట్టుబడింది. స్మగ్లింగ్ కార్యకలాపాల వల్ల పశ్చిమబెంగాల్ బోర్డర్లో ఓ బంగ్లా మహిళను అదుపులోకి తీసుకోవడంతో ఆమె వద్ద 15 కిలోల 607 గ్రాముల బంగారం, రూ.24.95 కోట్ల నగదును బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. నాదియాలోని బన్ పూర్ ప్రాంతంలో ఒక మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో సోదాలు చేయగా, అంత పెద్దమొత్తం దొరికింది.
పశ్చిమబెంగాల్లో అధికారం మారిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ సరిహద్దులోని భూమిని రక్షణ శాఖకు అప్పగించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ బంగ్లాదేశీ వలసదారుల్ని వెళ్లిపోవాలని హెచ్చరించగా, అటు కేంద్రం పెద్దయెత్తున నిఘా పెంచింది. అనుమానం ఉన్న ప్రతి వ్యక్తినీ క్షుణ్నంగా తనిఖీ చేస్తుండటంతో ఈ స్థాయిలో నగదు, బంగారం దొరికింది.