
రాత్రి పూట వాహనాల హెడ్ లైట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ పోలీసులు సూచించారు. ఎదురుగా వేరే వాహనం వచ్చినపుడు ‘హై బీమ్(High Beam Lights)’ను ‘లో బీమ్’గా మార్చాలని స్పష్టం చేసింది. ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్ల కళ్లను ‘హై బీమ్’ కాంతి బ్లైండ్ చేసి ప్రమాదాలకు కారణం కావచ్చని హెచ్చరించింది. వెనుక వెళ్తున్నప్పుడు కూడా ‘హై బీమ్’ ఉపయోగిస్తే రియర్ వ్యూ మిర్రర్ ద్వారా ముందున్న వెహికిల్స్ కు కూడా ప్రమాదమేనని చెప్పింది.
ఈ మధ్యకాలంలో వీటివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని గుర్తించిన పోలీసు శాఖ అందర్నీ అలర్ట్ చేస్తోంది. రాత్రిపూట నిజంగానే ఈ హై బీమ్ లైట్ల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని హైవేల్లో డివైడర్లపై గల చెట్లు చిన్నగా ఉండటంతో ఆ కాంతి నేరుగా ఎదుటి వాహనాల్లోని డ్రైవర్ల కళ్లల్లోకి పడుతోంది.