
కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ గవర్నర్(Governor) శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఎదుటే ఆయన సంతకం చేయడంతో కేబినెట్ నుంచి ఆమెను తొలగించే ప్రక్రియ పూర్తయింది. దీంతో సచివాలయం నాలుగో అంతస్తులోని సురేఖ ఛాంబర్ ను ముఖ్యమంత్రి కార్యాలయం(CMO) స్వాధీనం చేసుకుంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల అంశం ఇరువురి మధ్య చర్చకు వచ్చనట్లు తెలుస్తోంది. బర్తరఫ్ వెనుక గల కారణాలు, కేబినెట్లో శాఖల మార్పు, ఖాళీల భర్తీపై గవర్నర్ కు సీఎం వివరించారు. ఆమె పోర్ట్ ఫోలియోల్ని వేరే మంత్రులకు అప్పగించడం, మరో రెండు ఖాళీల్ని భర్తీ చేయడం సర్కారు ముందున్న లక్ష్యాలు.