
దేవతామూర్తుల ఫొటోలు తీసుకోవడంతోపాటు సెల్ఫీలు, వీడియోల రికార్డులు పెరుగుతుండటంతో తమిళనాడు సర్కారు ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆలయాల్లో స్మార్ట్ ఫోన్లు తీసుకువస్తే చర్యలు తీసుకోనుంది. అయితే కెమెరాలు లేని మాత్రం తీసుకెళ్లొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని 52 ప్రధాన ఆలయాల్లో స్మార్ట్ ఫోన్ల నిషేధం అమల్లోకి వచ్చింది. అరుణాచలం, కంచి, మదురై వంటి ప్రధాన గుడుల్లో ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటయ్యాయి.