
ముస్లిం మహిళలు అసలు బయటకే రావద్దని, అందుకే పరదా పద్ధతి వచ్చిందని కేరళ ముస్లిం మతపెద్ద అబూ బకర్ అహ్మద్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అతడు ఆల్ఇండియా సున్నీ జమియ్యతుల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. “మహిళల్ని ఒక పెట్టెలో భద్రంగా ఉంచాల్సిన బంగారు నగల్లాంటివారు.. వారిని బహిరంగ ప్రదేశాల్లోకి తీసుకురావడం ఘోర వినాశనానికి దారితీస్తుంది.. రోడ్డుపై బంగారం పడితే అందరూ తాకవచ్చు..” అన్నాడు.
హారం అందంగా కనిపించాలంటే దానిని ఒక పెట్టెలో భద్రంగా ఉంచాలి.. ఇస్లాం చారిత్రకంగా మహిళల హోదాను ఉన్నతస్థాయికి తీసుకెళ్లిందన్నాడు. తాము మతాన్ని అధ్యయనం చేశాం కాబట్టే ఇవన్నీ చెబుతున్నామని, అందువల్ల వాటి గురించి మాట్లాడే అర్హత మాకు మాత్రమే ఉందన్నాడు.