
పశ్చిమాసియా యుద్ధంలో శాంతి నెలకొనేందుకు జోక్యం చేసుకోవాలని భారత్ ను ఇరాన్ కోరింది. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ 26వ సదస్సులో ప్రధాని మోదీతో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ చర్చలు జరిపారు. యుద్ధ సమయంలో భారతదేశం అందిస్తున్న సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పెజెష్కియాన్.. అమెరికా-ఇరాన్ మధ్య జోక్యం చేసుకోవాలన్నారు. ఇప్పటిదాకా పాక్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా, ఇప్పుడు భారత్ ను అభ్యర్థించడం కీలక పరిణామంగా మారింది.
హార్ముజ్ ప్రధాన కేంద్రంగా జరుగుతున్న గొడవతో ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటాయి. అటు అమెరికాకు ఆయుధ నిల్వలు లేకుండా పోతే, ఇరాన్ కు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అమెరికాకు సహకరిస్తున్న యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్ సహా పలు దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతుంటే, ముస్లిం దేశాలు ఏకమై పాక్ ను రంగంలోకి దించాయి. కానీ ఆ ఆశలు ఫలించకపోగా, పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.