
తమిళనాడులోని జోసెఫ్ విజయ్ సర్కారుకు కాంగ్రెస్ ఝలక్ ఇచ్చింది. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అభ్యర్థిత్వానికి మద్దతివ్వకపోతే ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీకి 48.7 నుంచి 58%, రాహుల్ కు 27.1% ఓటేయగా.. పార్లమెంటులో ఒక్క సీటూ లేని టీవీకే అధినేత విజయ్ కి 9.2% మంది మద్దతు పలికారు. దీంతో 2029లో విజయ్ ప్రధాని అభ్యర్థి అంటూ ప్రచారాన్ని ప్రారంభిస్తూ పోస్టర్లు వెలియడంతో కాంగ్రెస్ లో కాక రేగింది. ఉత్తర భారతంలోనూ విజయ్ కి ఆదరణ పెరుగుతోందని టీవీకే నంబర్ టూ నేత సెంగొట్టియాన్ అనడంతో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కాస్తా అసెంబ్లీలో విపక్షాల పక్కన కూర్చున్నారు.