
నల్గొండలో కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి రాళ్లదాడికి దారితీసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయం వద్ద బీజేపీ తొలుత ఆందోళన నిర్వహించింది. ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడంతో ఆందోళనకారుల్ని పోలీసులు చెదరగొట్టారు. దీనికి ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో బీజేపీ ఆఫీసుపై దాడికి దిగారు. కార్యాలయం గేటు మూసివేసి ఉండటంతో అక్కడున్న ఫ్లెక్సీని చించి కిందపడేశారు. ఇలా ఇరువర్గాలు చివరకు రాళ్లు విసురుకునే వరకు వెళ్లడంతో జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు రెండు వర్గాల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.