
రికార్డుల సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో ఘనత అందుకున్నాడు. దులీప్ ట్రోఫీలో 42 బంతుల్లోనే ఫిఫ్టీ చేసి మొత్తంగా 92 పరుగులతో 57 ఏళ్ల నాడు నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. 1969లో లక్ష్మణ్ సింగ్(16 ఏళ్ల 23 రోజులు-హాఫ్ సెంచరీ) సాధించిన ఘనతను వైభవ్(15 ఏళ్ల 157 రోజులు) అధిగమించాడు. మిగతా ఆరు ఘనతలు ఇలా…
*14 ఏళ్ల 32 రోజుల వయసులోనే ఐపీఎల్ హాఫ్ సెంచరీ,
*14 ఏళ్ల 32 రోజుల వయసులోనే ఐపీఎల్ సెంచరీ,
*35 బంతుల్లోనే ఐపీఎల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు,
*లిస్ట్-ఏ క్రికెట్లో 14 ఏళ్ల 272 రోజుల వయసులో శతకం
*ధనాధన్ బ్యాటింగ్ తో టీ20ల్లో వేగంగా 100 సిక్సర్లు,
*ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సులు(72) బాది వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు చెరిపివేత.