
అనలాగ్ కంపెనీ వంటకాలను తక్షణమే నిలిపేసినట్లు ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) ప్రకటించింది. తన రెస్టారెంట్ భాగస్వాములు అనలాగ్ పాల ఉత్పత్తులు కలిగి ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని వాటి యజమానులకు స్పష్టం చేసింది. అసలు పాలకు బదులుగా వృక్ష ఆధారిత నూనెలు, స్టార్చ్, కృత్రిమ రసాయనాలతో పన్నీర్, కోవా, నెయ్యి తయారు చేస్తోందని గుర్తించింది. పాల ధరలు ఎక్కువగా ఉన్నందున మిల్క్ ఫ్యాట్ కు బదులు వెజిటెబుల్స్ ఆయిల్స్, ఇతర రసాయనాలతో పదార్థాల్ని తయారు చేస్తోంది.
ఇప్పటికే ఆ కంపెనీ ఉత్పత్తుల్ని మహారాష్ట్ర, యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం పాలు, పాల ఉత్పత్తులను వాటి సహజరూపంలోనే తయారు చేసి అమ్మాలి. యూపీలో నిర్వహించిన తనిఖీల్లో టాల్కమ్ పౌడర్, డిటర్జెంట్లు, టైటానియం డైయాక్సైడ్, లిక్విడ్ గ్లూకోజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలనూ వాడారని తేలింది.