
భారీ వర్షం.. చుట్టూ చీకటి.. ఇలాంటి పరిస్థితుల్లో బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నిర్భయ తరహా ఘటనను తలపించిన కేసులో… ఉత్తర ప్రదేశ్ లోని మైన్ పురి జిల్లాకు చెందిన బాలిక తన కుటుంబంతో గొడవ పడి ఇంటి నుంచి బయల్దేరింది. నోయిడాలోని కజిన్ ను కలవడానికి వెళ్తూ మధ్యలోనే దారి తప్పిపోయింది. సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆ రోడ్డులోనే వెళ్తున్న ఖాళీ స్లీపర్ బస్సు ఆగింది.
సాయం అడగటంతో ఆమెను బస్సు ఎక్కించుకున్న తర్వాత 47 కిలోమీటర్లు దాటి కశ్మీర్ గేట్ ప్రాంతంలో డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ ఆమెపై అత్యాచారం చేశారు. జరిగిన దారుణాన్ని బాధితురాలు కశ్మీర్ గేట్ పోలీసులకు చెప్పడంతో నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు ముందు ఆ బస్సుకు రిపేర్ ఉండటంతో తిమార్పూర్ లో బాగు చేయించారు. రిపేర్ అయిన తర్వాత బస్సును తీసుకెళ్తుండగా బాలిక కనపడింది.