వికెట్ల వెనకాల చురుగ్గా కదిలితే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో రిషభ్ పంత్ నిరూపించాడు. అత్యద్భుత(Wonderful) వికెట్ కీపింగ్ తో మూడు వికెట్లను గిరాటేశాడు(Out). పంత్ దెబ్బకు విలవిల్లాడిన గుజరాత్… కీలక వికెట్లను చేజార్చుకుని కోలుకోలేని కష్టాల్లో పడింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్(DC).. గుజరాత్ కు బ్యాటింగ్ ఇచ్చింది. ఓపెనర్లతోపాటు టాప్, మిడిలార్డర్ అంతా టపటపా వికెట్లు చేజార్చుకోవడంతో గుజరాత్ టైటాన్స్(GT) 100 స్కోరు దాటుతుందా అని అనిపించింది. అనుకున్నట్లే చివరకు 89కే చాప చుట్టేసింది.
20 దాటిన ఒకే ఒక్కడు…
గుజరాత్ టీమ్ లో ఒకే ఒక్క బ్యాటర్ 20 స్కోరు దాటాడంటే మిగతా ప్లేయర్ల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఓపెనర్లు సాహా(2), గిల్(8) వికెట్లు సమర్పించుకుంటే ఆ తర్వాత వెంటనే సాయి సుదర్శన్(12), రనౌటయ్యాడు. ఇక అప్పుడు మొదలైంది పంత్ కీపింగ్ మాయాజాలం. డేవిడ్ మిల్లర్(2) క్యాచ్ ను ఎడమ వైపు(Left Side) డైవ్ చేసి అందుకోవడం ఆటకే హైలెట్.
క్రీజులో లేజీగా…
ఇక క్రీజులో అసంబద్ధం(Lazy)గా కదిలినందుకు ఇద్దరు బ్యాటర్లు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. నిర్లక్ష్యం అనేదాని కంటే పంత్ చురుకుదన(Agility)మే అని చెప్పాలి. మనోహర్(8), షారుక్ ఖాన్(0)ను సూపర్ స్టంపింగ్స్ తో ఔట్ చేసి ఔరా అనిపించాడు. 28 స్కోరుకు 3 వికెట్లతో ఉన్న GT 48/6కు చేరుకుంది. తెవాతియా(10), మోహిత్ శర్మ(4) కూడా ఔట్ కావడంతో 78 స్కోరుకే 8 వికెట్లు చేజార్చుకుంది. మొత్తానికి ఢిల్లీ కెప్టెన్ పంత్ మాయాజాలం గుజరాత్ ను కోలుకోలేని దెబ్బతీసింది. రషీద్ ఖాన్(31) ఒక్కడే కొద్దిసేపు నిలబడ్డాడు.