తొలుత బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్ తో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ సన్ రైజర్స్(SRH)… ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగి 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోరు చేసిన సన్ రైజర్స్… తర్వాత ఢిల్లీని 199 రన్స్ కే ఆలౌట్ చేసి 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్(Points Table)లో రెండో స్థానానికి ఎగబాకింది.
ఢిల్లీ ఢీలా…
ఢిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీస్తే.. ప్రత్యర్థి జట్టులోనూ నటరాజన్ అదరగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 19 రన్స్ మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ఓపెనర్లు పృథ్వీషా(16), వార్నర్(1) తొందరగానే ఔటైనా వన్ డౌన్లో వచ్చి జాక్ ఫ్రేజర్(65; 18 బంతుల్లో 5×4, 7×6)) చెండాడాడు. ఈ కుర్రోడి హిట్టింగ్(Hitting)తో విజయం దిశగా దూసుకుపోయినట్లే కనపడింది ఢిల్లీ.
తొలి మూడు ఓవర్లలోనే 50 పరుగులు దాటింది ఢిల్లీ. మూడో ఓవర్లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో ఫ్రేజర్ మెక్ గర్క్ 30 రన్స్ తీశాడు. వరుస బాల్స్ లో 4, 4, 6, 4, 6, 6 బాదాడు. కానీ ఇతడితోపాటు ఆ తర్వాత వచ్చిన పోరెల్(42; 22 బంతుల్లో 7×4, 1×6), స్టబ్స్(10), పంత్(44; 35 బంతుల్లో 5×4, 1×6) ఎండింగ్ వరకు నిలబడలేకపోయారు.
SRH నుంచి…
హెడ్(89; 32 బంతుల్లో 11×4, 6×6), అభిషేక్(46; 12 బంతుల్లో 2×4, 6×6), మార్ క్రమ్(1), క్లాసెన్(15), నితీశ్(37), షాబాజ్(59 నాటౌట్; 29 బంతుల్లో 2×4, 5×6), ఉతికి ఆరేయడంతో SRH భారీ స్కోరు చేసింది.