ఆల్ రౌండర్ గస్ అట్కిన్సన్(Gus Atkinson) సూపర్ బ్యాటింగ్, బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో ఇంగ్లండ్ భారీ విజయం సాధించింది. శ్రీలంకతో లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో 190 రన్స్ తేడాతో గెలుపొందింది. అట్కిన్సన్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ(118) చేయడంతోపాటు రెండు ఇన్నింగ్స్ ల్లోనూ ఏడు వికెట్లు(2+5) పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లిష్ జట్టు 427 పరుగులు చేస్తే శ్రీలంక 196కే ఆలౌట్ అయింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లండ్ 251 స్కోరు చేసి ప్రత్యర్థికి 483 పరుగుల టార్గెట్ ఇచ్చింది. కానీ రెండో ఇన్నింగ్స్ లో లంక 292కే చాప చుట్టేసి భారీ తేడాతో పరాజయం మూటగట్టుకుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఒలీ పోప్ సేన 2-0తో నిలిచింది.