వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) 20 నెలల తర్వాత టెస్టు క్రికెట్లో పునరాగమనం(Re-Entry) చేస్తున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కు జట్టును BCCI ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీంలో విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా ఉంటారు. ఆకాశ్ దీప్, యంగస్టర్ యశ్ దయాల్ కు పిలుపొచ్చింది. సెప్టెంబరు 19న చెన్నైలో సిరీస్ ప్రారంభమవుతుంది.
టీమ్ ఇదే…
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్లు), జస్ప్రీత్ బుమ్రా, రవిచందన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్