కోల్ కతాలో జరిగిన తొలి మ్యచులో 3, చెన్నై చెపాక్ లో రెండు వికెట్లు తీసి ఊపు మీదున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడో టీ20లో మరింత రెచ్చిపోయాడు. జోష్ మీదున్న జోస్ బట్లర్(24)ను ఔట్ చేసిన అతడు.. జేమీ స్మిత్(6), జేమీ ఓవర్టన్ వరుస బంతుల్లో వెనక్కు పంపాడు. 108/4తో పటిష్ఠ స్థితిలో నిలిచిన ఇంగ్లిష్ టీమ్ 127కు చేరుకునేసరికి 7 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ బెన్ డకెట్(51) విజృంభించినా మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్(5), హ్యారీ బ్రూక్(8), కార్సె(3), ఆర్చర్(0) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. 127 స్కోరు వద్దే కార్సె, ఆర్చర్ లిద్దరూ చక్రవర్తికి దొరికిపోయారు. పోరాటం చేస్తున్న లివింగ్ స్టోన్(43)ను హార్దిక్ పాండ్య ఔట్ చేశాడు. నాలుగు ఓవర్ల స్పెల్ లో 24 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లతో మ్యాచ్ ను వరుణ్ శాసించాడు. చివరకు ఆ జట్టు 9 వికెట్లకు 171 స్కోరు చేసింది.