ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా(South Africa).. రెండో ఇన్నింగ్స్ లో పోరాటం చేస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 212కు ఆలౌట్ కాగా, సౌతాఫ్రికా 138కే చాప చుట్టేసింది. 74 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన కంగారూ జట్టు.. 207కు ఆలౌటై ప్రత్యర్థి ఎదుట 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 75 స్కోరు చేసింది. మ్యాచ్ లో రబాడ 9 వికెట్లు తీసుకోగా, ఆసీస్ కెప్టెన్ కమిన్స్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో సౌతాఫ్రికాను దెబ్బతీశాడు.