
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడి జన్మస్థలం మథురలో ప్రత్యేక పూజలు, మంగళహారతుల కోసం పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేశారు. రాధాకృష్ణుల నిలయమైన బృందావన్, గుజరాత్ ద్వారక, కర్ణాటక ప్రసిద్ధ ఉడుపి మఠంతోపాటు ఇస్కాన్ ఆలయాలు, కృష్ణ మందిరాలు విద్యుత్తు దీపకాంతుల్లో మెరిసిపోతున్నాయి. చిన్నారుల్ని కృష్ణుని వేషధారణలో అలంకరించి సంబరాలు చేస్తున్నారు.