ముఖ్యమంత్రి మంగళవారం నాడు ప్రారంభించిన అంబులెన్సుల నిధులు కేంద్రం ఇచ్చినవేనని BJP రాష్ట్ర శాఖ ట్విటర్ ద్వారా ప్రకటించింది. సొమ్ము కేంద్రానిది.. సోకు కేసీఆర్ ది అంటూ ట్వీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే అంబులెన్సులను కొనుగోలు చేశారని, రూ.103 కోట్ల తమ సర్కారు నిధులతోనే వీటిని ప్రారంభించినట్లు స్పష్టం చేసింది.
నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా అంబులెన్స్ లను కొనుగోలు చేశారని, కానీ రాష్ట్రం నిధులతో కొన్నట్లు కేసీఆర్ ప్రభుత్వం బిల్డప్ లు ఇస్తోందంటూ ట్విటర్ ద్వారా విమర్శించింది.