
స్టార్ నటి రష్మికకు అరుదైన ఘనత దక్కింది. ప్రపంచ యానిమేటెడ్, వెబ్ సిరీస్ లకు ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘క్రంచీరోల్ యానిమే అవార్డుల’ వేడుకకు మరోసారి ముఖ్య అతిథి గౌరవం అందుకుంది. యానిమేటెడ్ చిత్రాలు, వెబ్ సిరీసుల్లో ప్రతిభ చూపినవారికి ఈ అవార్డులు ఇస్తుంటారు. 10వ ఎడిషన్ వేడుక మే 23న జపాన్ రాజధాని టోక్యోలో జరగనుంది. 2024లో తొలిసారి ‘క్రంచీరోల్ యానిమే అవార్డుల’ వేదికపై మెరిసిన ఆమె.. రెండోసారి గౌరవాన్ని దక్కించుకున్నారు. హాలీవుడ్ ప్రముఖ నటీనటులతో కలిసి విజేతలకు బహుమతుల్ని రష్మిక ప్రదానం చేయనుంది.