హనుమకొండ జిల్లాలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కారును టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో పెను విషాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం నీరుకుల్ల క్రాస్ సమీపంలో ప్రమాదం జరిగింది. వరంగల్ కాశీబుగ్గకు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు మేడారం దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులకు వరంగల్ MGM హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.