అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనంద్ రావు(52) సూసైడ్ చేసుకున్నారు. భార్య అనురాధతో గత కొద్దిరోజులుగా ఆనంద్ రావుకు గొడవలు జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఆయన ఇంట్లోనే ఉరి వేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డట్లు చెబుతున్నారు. గత 9 నెలలుగా ఆనంద్ రావు తాడిపత్రిలో పనిచేస్తున్నారు.
భార్యతో తరచూ గొడవలు జరుగుతుండగా ఆదివారం రాత్రి కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పని ఒత్తిడికి తోడు ఇంట్లో సమస్యలు ఉండటంతో సీఐ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి కాగా.. ఆనంద్ రావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.