
పాత మొబైళ్లు ఎక్చేంజ్ చేస్తున్నారా.. ఫోన్లు అమ్మి స్టీల్ పాత్రలు కొంటున్నారా.. అదెంత ప్రమాదమో పోలీసులు బయటపెట్టారు. 8 మంది బిహార్ ముఠా పాత ఫోన్ల మదర్ బోర్డుల్ని చైనా, బంగ్లాకు అమ్మేస్తోంది. అందులోని డేటాతో బ్యాంకు ఖాతాల్ని నేరగాళ్లు ఖాళీ చేస్తున్నారు. ఈనెల 16న యూపీ మీర్జాపూర్ జిల్లా లాల్ గంజ్ లో అనుమానాస్పద ట్రక్కును ఆపి 11,605 ఫోన్లు పట్టుకోవడంతో అసలు కథ వెలుగుచూసింది. అరెస్టయిన వారిలో ఒక సామాన్య మొబైల్ షాప్ దుకాణ యజమాని ఉన్నాడని గుర్తించారు. అక్కడి హ్యాకర్లు అత్యాధునిక సాఫ్ట్ వేర్ ఉపయోగించి పాత బోర్డుల నుంచి డిలీట్ చేసిన డేటాను రికవరీ చేస్తున్నారు. అంటే పాత ఫోన్లు ఇప్పుడు దేశ భద్రతకు ముప్పుగా తయారయ్యాయి. దీనిపై ఉత్తరప్రదేశ్, బిహార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.