హోంమంత్రి పదవి దక్కించుకుని BRS నేతల్ని జైలులో పెట్టాలనుందని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ జిల్లా మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనకు అధిష్ఠానం(High Command) హామీ ఇచ్చిందని, అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిపారు. KCR, KTR, హరీశ్ రావు, సంతోష్ రావు కారాగారానికి వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున లాబీల్లో తారసపడ్డ రాజగోపాల్ రెడ్డి, కేటీఆర్ ఆసక్తికరంగా మాట్లాడుకున్నారు. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందంటూ కేటీఆర్ అడగడంతో.. తనకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ ఉందని రాజగోపాల్ జవాబివ్వడంతో ఈ చర్చ ఇంట్రెస్టింగ్ మారింది.
అందుకే కాంగ్రెస్ లోకి…
‘నాకు హోం శాఖ ఇవ్వాలని కోరుతున్నా… నేను కాంగ్రెస్ లోకి వచ్చిందే కేసీఆర్ ను గద్దె దించేందుకు… KCR కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లడం ఖాయం.. BRS ఎమ్మెల్యేలను కేసీఆరే BJPలోకి పంపుతారు… BRS వాళ్లను జైలుకు పంపాలని ఉంది’… అని రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Published 08 Feb 2024