శివరాత్రికి శివ శివా అంటూ చలి పోతుందట. ఆ చలి తగ్గిన తర్వాత క్రమంగా ఎండలు మొదలవుతాయి. కానీ శివరాత్రి రాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి. గత మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన ఉష్ణోగ్రతలు(Temparatures) రికార్డవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతున్నది. ఒంటి పూట(Half Day) బడులు స్టార్ట్ చేయాలని నిర్ణయించింది.
ఈ నెల 15 నుంచే…
ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. పొద్దున 8 నుంచి పగలు 12 గంటల వరకు మాత్రమే పాఠశాలలు నడుస్తాయి. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారుల(DEO)లకు ఉత్తర్వులు పంపించింది. పగలు 12:30 గంటలకు మధ్యాహ్నం భోజనం ఉంటుంది.
ఇక పరీక్ష కేంద్రాలు(Exam Centres) ఉన్న స్కూళ్లకు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బడులు నడుస్తాయని పాఠశాల విద్యాశాఖ(School Education) స్పష్టం చేసింది.