రాష్ట్రంలో ఉద్యోగాల(Jobs) నియామకాల(Recruitments) ప్రక్రియ ఊపందుకుంది. డీఎస్సీ, టెట్ పై పూర్తి క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం… టీచర్ల భర్తీ పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని ఆదేశించడం, ఆ వెంటనే విద్యాశాఖ నుంచి టెట్-2024 నోటిఫికేషన్ రావడం చకచకా జరిగిపోయాయి. ఈ రెండు ఇలా ఉంటే ఇప్పుడు మరో ముందడుగు వేస్తూ విద్యాశాఖ.. DSC పరీక్షల తేదీల్ని సైతం ప్రకటించింది.
ఈ తేదీల్లో…
డీఎస్సీ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు జరగనుండగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే DSC ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు.