పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు నేతలు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో సినీ అరంగేట్రం(Entry) చేసిన పవన్.. ‘తొలిప్రేమ’తో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించారు. ‘బద్రి’, ‘తమ్ముడు’ సినిమాలు ఆయన్ను ‘సంథింగ్ స్పెషల్’గా ఫ్యాన్స్ కు చేరువ చేశాయి.
హిట్టయినా, ఫ్లాప్ అయినా రిలీజయిన ప్రతి సినిమా రేంజ్ పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. సెపరేట్ స్టార్ డమ్ సెట్ చేసుకోవడంలో పవన్ ను మించిన వారు లేరు. అలాంటి తన తమ్ముడికి స్పెషల్ విషెస్ చెప్పారు మెగాస్టార్. ‘ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంది.. కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం.. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి’ అంటూ ట్వీట్ చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, AP సీఎం చంద్రబాబుతోపాటు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు.. ఆయన అభిమానులు జన్మదిన సందేశాలు పంపించారు.