ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ CM పవన్ కల్యాణ్.. CM రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసాని(Residence)కి వచ్చిన పవన్.. కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును అందించారు. వరద బాధితుల కోసం తెలంగాణకు కోటి రూపాయలు, APకి రూ.5 కోట్లను జనసేన చీఫ్ ప్రకటించారు. ఆ మేరకు ఆయన ముఖ్యమంత్రిని కలిసి విరాళం అందజేశారు.