గ్రూప్-1 రీ-నోటిఫికేషన్(Re-Notification)ను సవాల్ చేస్తూ దాఖలైన కేసుపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. పిటిషనర్లు, TGPSC న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేశారు. రీ-నోటిఫికేషన్, ‘కీ’, ST రిజర్వేషన్లను సవాల్ చేస్తూ రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. సబ్జెక్ట్ నిపుణుల(Experts) కమిటీ అన్ని అంశాలు పరిశీలించాకే ‘కీ’ రూపొందించామని, ఈ పిటిషన్లను కొట్టివేయాలని TGPSC కోరింది. అక్టోబరు 21 నుంచి మెయిన్స్ పరీక్షలు ఉన్న దృష్ట్యా ఈ తీర్పు కీలకంగా మారింది.