ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన తెలంగాణ IASలు APకి వెళ్లాల్సిందేనని కేంద్రం ఆదేశాలివ్వడంతో రాష్ట్రం నుంచి పలువురు IAS, IPSలు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొంత కేడర్లో రిపోర్ట్ చేయాలని కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(DoPT) ఆదేశించడంతో వారంతా APలో రిపోర్ట్ చేయాల్సి ఉంది.
IASల్లో వాణీప్రసాద్(1995), వాకాటి కరుణ(2004), రొనాల్డ్ రోస్(2006), ప్రశాంతి(2009), అమ్రపాలి కాట(2010)తోపాటు IPSలు అంజనీకుమార్(1990), అభిలాష్ బిస్త్(1994), అభిషేక్ మహంతి(2011) ఉన్నారు.