ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏను ఇస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. బకాయి పడ్డ ఐదు DAలకు గాను ఒక DAకు రాష్ట్ర మంత్రివర్గం(Cabinet) ఆమోదం తెలిపింది. 317 జీవో వల్ల ఇబ్బందులు పడ్డ ఉద్యోగులకు ఊరటనిస్తూ స్పౌస్, మ్యూచువల్, హెల్త్ సమస్యలు గల వారి బదిలీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానికతకు సంబంధించి 317 జీవో.. నిరుద్యోగ యువతకు ఉద్దేశించిన 46 జీవోలోని అంశాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తీసుకురాబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. న్యాయస్థానాల్లో కేసుల వల్ల కొన్ని అడ్డంకులున్నందున శాసనసభ సమావేశాల్లోనే చర్చకు పెట్టి తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామన్నారు.