లగచర్ల దాడి ఘటనలో అరెస్టయి జైలులో ఉన్న మాజీ MLA పట్నం నరేందర్(Patnam Narender).. హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. నేడు కోర్టుకు సెలవు(Holiday) కావడంతో హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. నేరస్థులతో కలిపి ఆయన్ను ఉంచారని, ఇది ప్రమాదకరమైనందున ఆయన్ను స్పెషల్ బ్యారక్ లో ఉంచేలా చూడాలని అభ్యర్థించారు. ఆ పిటిషన్ ను పరిశీలించి తిరస్కరించింది హైకోర్టు రిజిస్ట్రీ.