గ్రామసభల్లో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) కోసం దరఖాస్తులు స్వీకరించిన వేళ.. వాటిని ఎప్పుడిస్తారన్నదానిపై ఇప్పటికే మంత్రులు క్లారిటీ ఇవ్వగా ముఖ్యమంత్రి రేవంత్ సైతం వాటి గురించి హామీ ఇచ్చారు. కొత్త కార్డుల విషయంలో మాట తప్పబోమని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు. రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన CM.. కొత్త కార్డులపై మరోసారి ప్రకటన చేశారు. ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకునేందుకు అధికారులనే గ్రామసభలకు పంపించామన్న CM.. గతంలో ఏవైనా కావాలంటే ఫాంహౌజ్ కు వెళ్లాల్సి వచ్చేదన్నారు. కాంగ్రెస్ పాలనలో MLAలు, అధికారులే ప్రజల వద్దకు వచ్చి మరీ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, మనం ఎన్నుకున్న సర్పంచ్ మన దగ్గర లేకుంటే ఎలా ఉంటుందో గత CM ప్రజల వద్దకు రాకపోవడం అలాంటిదేనని గుర్తు చేశారు.