గణితం(Mathematics) అంటే చాలా మందికి భయం. కానీ చేతి వేళ్ల ద్వారానే లెక్కల్ని చేయగలిగితే.. న్యూరో టెక్నిక్స్ ద్వారా అంకెల్ని సులువుగా వల్లె వేస్తే.. అంతకన్నా కావాల్సిందేముంటుంది. అలా చతుర్విధ ప్రక్రియలు నేర్పే అబాకస్ శిక్షణను ఉచితంగా అందిస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గంగాధర్. పూర్వకాలంలో గ్రీకులు, బాబిలోనియన్లు ఈ ‘అబాకస్’ ఆధారంగానే లెక్కలు కట్టేవారు. లెవెల్ వన్ ఉచిత శిక్షణను యాప్(App) ద్వారా అందిస్తున్నారు గంగాధర్. యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజూ మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు క్లాస్ జరుగుతుంది.
https://smhmer.on-app.in/app/oc/669742/smhmer?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-