తెలంగాణ ప్రభుత్వం.. గద్దర్ అవార్డుల్ని ప్రకటించింది. 14 సంవత్సరాల తెలుగు సినీ అవార్డుల్ని ఇస్తున్నారు. 2024 పురస్కార(Awards) విజేతల్ని జ్యూరీ ఛైర్మన్ జయసుధ ప్రకటించారు. 2014-2023 పేర్లను త్వరలోనే తెలియజేస్తారు. హైదరాబాద్ హైటెక్స్ లో జూన్ 14న అవార్డుల ప్రదానం జరుగుతుంది.
అవార్డులివే…
2024 https://justpostnews.com
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్(పుష్ప-2)
ఉత్తమ నటి – నివేదా థామస్(35 ఇది చిన్న కథ కాదు)
ఉత్తమ దర్శకుడు- నాగ్ అశ్విన్
ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ – కల్కి2898AD
సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ – పొట్టేల్
థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ – లక్కీ భాస్కర్
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – ఆయ్… మేం ఫ్రెండ్స్ అండీ
బెస్ట్ ఎన్విరాన్ మెంట్-హెరిటేజ్ – రజాకార్
ఉత్తమ బాలల చిత్రం – 35 ఇది చిన్న కథ కాదు https://justpostnews.com
ఉత్తమ సహాయనటుడు – ఎస్.జె.సూర్య(సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయనటి – శరణ్యప్రదీప్(అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు – బీమ్స్(రజాకార్)
ఉత్తమ కమెడియన్స్ – వెన్నెల కిషోర్, సత్య
ఉత్తమ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి
ఉత్తమ గాయని – శ్రేయ ఘోషల్(పుష్ప-2)
ఉత్తమ కొరియో గ్రాఫర్ – గణేశ్ ఆచార్య(దేవర)
స్పెషల్ జ్యూరీ – అనన్య నాగళ్ల(పొట్టేల్)
స్పెషల్ జ్యూరీ – దుల్ఖర్ సల్మాన్(లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యూరీ – ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా)