జనాభా 16 లక్షలు.. ఏడాదిలో 2.6 కోట్ల మంది పర్యాటకులు. ఇళ్ల అద్దె(Rent)లు 50% పెరిగి సొంతూరోళ్లకే కిరాయికి దొరకట్లేదు. స్పెయిన్ లోని బార్సిలోనా(Barcelona).. సాంస్కృతిక కట్టడాలు, సూర్యోదయ సముద్రతీర అందాలకు ప్రసిద్ధి. భారీ ఆదాయమున్నా స్థానికులు నివసించే పరిస్థితి లేదు. అందుకే ‘మీ హాలిడే మా దౌర్భాగ్యం.. టూరిస్టులారా గో హోమ్’ అంటూ నిరసనలు చేస్తున్నారు. దీంతో అక్కడ స్వల్పకాలిక అద్దెల్ని 2028 వరకు నిషేధించారు. స్పెయిన్ జనాభా 4.8 కోట్లయితే 2024లో 10 కోట్ల మంది పర్యటించారు. దేశ GDPలో 15% టూరిజం నుంచే. ఇబిజా, మలోర్కా, మలగా, పల్మా, శాన్ సెబాస్టియన్ పట్టణాలతోపాటు యూరప్ లోని ఇటలీ, పోర్చుగల్లోనూ ఇదే పరిస్థితి. https://justpostnews.com