హైదరాబాద్(Hyderabad) అంటేనే ట్రాఫిక్ రద్దీ. కానీ మెట్రోతో ప్రయాణాలు సులువు కాగా రానున్న రోజుల్లో జర్నీ మరింత ఈజీ కానుంది. ఇప్పుడు మెట్రో-2Bకి పరిపాలన అనుమతులు వచ్చాయి. రూ.19,579 కోట్లతో 81.6 కిలోమీటర్ల మేర 3 కారిడార్లు నిర్మిస్తారు. రాష్ట్ర వాటా రూ.5,874 కోట్లు, కేంద్రం వాటా రూ.3,524 కోట్లు కాగా రూ.9,398 కోట్ల రుణాలు సేకరిస్తారు.
ఎలా ఉంటుందంటే…
కారిడార్-1…: శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ(39.6 కి.మీ)
కారిడార్-2…: జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్(24.5 కి.మీ)
కారిడార్-3…: జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్ పేట(22 కి.మీ)