ఇరాన్ సుప్రీం లీడర్ అయెతుల్లా అల్ ఖమేనీ కోసం ఇజ్రాయెల్ వేట(Target) నడుస్తోంది. ఆయన్ను చంపే ప్లాన్ ను డొనాల్డ్ ట్రంప్ అడ్డుకున్న విషయాన్ని అమెరికా యంత్రాంగం బయటపెట్టిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఖమేనీ సహా ఆయన కుటుంబాన్ని సురక్షిత బంకర్లో దాచి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్(IRG) కాపాడుతున్నాయి. ‘మేం ఏం చేయాలో అది చేస్తామని చెప్పగలను.. ఏది మంచిదో అదే చేయగలం.. ఖమేనీ హతమైతేనే యుద్ధానికి ముగింపు.. అమెరికాకు ఏది మంచిదో ఆ దేశానికి తెలుసు..’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు. అటు అమెరికా వార్నింగ్ తో ఇరాన్ ప్రజలు టెహ్రాన్ ను ఖాళీ చేస్తున్నారు.