అమెరికా ‘డూమ్స్ డే’ విమానం సాధారణంగా కనిపించదు. కానీ ఇది ఎగిరిందంటే ఏదో దేశంపై అగ్రరాజ్యం దాడికి దిగుతున్నట్లే. వాషింగ్టన్ డి.సి.లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ లో ఈ ఫ్లైట్ ఎగిరింది. యుద్ధంలో పాల్గొనేముందు దీన్ని గాల్లోకి పంపడం USకు అలవాటు. ఈ ఫ్లైట్ అసలు పేరు బోయింగ్ E-4B నైట్ వాచ్ కాగా, ‘ఫ్లైయింగ్ పెంటగాన్’ అని కూడా అంటారు. 7 వేల మైళ్లకు పైగా 112 మందితో వెళ్లనుండగా.. 67 శాటిలైట్లతో అణు, సైబర్ దాడుల్ని తట్టుకోగలదు. కంటిన్యూగా వారం పాటు గాల్లోనే ఉంటూ ఏకధాటిగా 35 గంటలు ప్రయాణిస్తుంది. అధ్యక్షుడు, రక్షణశాఖ కార్యదర్శి, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అమెరికా ఇరాన్ పై దాడికి దిగడంలో ఇక ఆశ్చర్యం లేదు.