రష్యా-ఇరాన్ ది దశాబ్దాల దృఢమైన బంధం. ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ పై అమెరికా బాంబులు వేస్తున్నా పుతిన్(Putin) స్పందించట్లేదు. అగ్రరాజ్యం ఎంట్రీతో ప్రపంచ యుద్ధం(World War) మొదలైందని భావించారు. రష్యా, చైనా.. ఇరాన్ కు సపోర్ట్ చేస్తాయనుకున్నా పుతిన్ ఆలోచన వేరేలా ఉంది. ఖమేనీ సర్కారుకు దూరంగా ఉండాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పుతిన్ ఏమన్నారంటే… ‘ప్రస్తుతం అందరూ మావైపే చూస్తున్నారు.. ఇరాన్ కు మద్దతిస్తామా లేదా అని.. సోవియట్ యూనియన్ విడిపోయాక 20 లక్షల మంది ప్రజలు ఇజ్రాయెల్ లో ఉన్నారు.. 2 మిలియన్ల మంది రష్యన్ భాషనే మాట్లాడుతున్నారు.. అంటే ఇజ్రాయెల్ కూడా ఇంచుమించు రష్యానే.. ఈ విషయాన్ని నేను మరవకూడదు..’ అని చెప్పడంతో ఇక రష్యా యుద్ధరంగంలోకి దిగే అవకాశాలు లేనట్లే. https://justpostnews.com