ఇరాన్ సుప్రీం లీడర్ అయెతుల్లా అల్ ఖమేనీ కోసం ఇజ్రాయెల్ చేయని ప్రయోగం లేదు. కానీ ఆయన్ను పట్టుకోవడంలో ఫెయిలైంది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్(Israel Katz) ఒప్పుకున్నారు. ‘అతను IDF దృష్టిలో ఉంటే కచ్చితంగా దాడి జరిగేదే.. ఇరాన్ అణు కార్యక్రమాల్నే లక్ష్యంగా పెట్టుకున్నా, ఖమేని హత్యే తమకు ప్రాధాన్యం.. కానీ ఖమేనీ వెనక్కు తగ్గి త్వరగా బంకర్లోకి వెళ్లారు.. అగ్ర సైనిక కమాండర్లతోనూ కమ్యూనికేషన్ తెంచుకున్నారు.. ఇజ్రాయెల్ దాడి తీరును అర్థం చేసుకుని చాలా లోతైన భూగర్భంలో దాక్కున్నారు..’ అని వివరించారు. ఇరాన్ చీఫ్ ఎక్కడున్నారో తెలుసు.. అతను సులభమైన టార్గెట్ అంటూ ట్రంప్ ప్రకటన చేసినా తర్వాత వెనక్కు తగ్గారన్నారు.