వైద్యారోగ్యశాఖ(Medical & Health)లో 607 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. జనరల్ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్, అనస్థీషియా వంటి 34 విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రకటన విడుదలైంది. మల్టీజోన్-1లో 379, మల్టీజోన్-2లో 228 ఖాళీలున్నాయి. UGC(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) నిబంధనల మేరకు ఒక్కో అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.68,900-రూ.2,05,500 అందుతాయి. వివరాలకు https://mshrb.telangana.gov.in సంప్రదించవచ్చని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME) స్పష్టం చేసింది.
షెడ్యూల్ ఇలా… https://justpostnews.com
10-07-2025…: ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం
17-07-2025…: ఆన్లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ(సాయంత్రం 5 వరకు)
18-07-2025 నుంచి 19-07-2025(సాయంత్రం 5 వరకు)…: అప్లికేషన్లు ఎడిట్ చేసుకునే అవకాశం