ప్రతి పదేళ్లకు కచ్చితంగా యుద్ధం చేసే దేశం ఇజ్రాయెల్(Israel). 90 లక్షల జనాభాలో 75% యూదులైతే, 20%తో అరబ్బులు. ప్రపంచంలో యూదుల ఏకైక దేశమైన ఇజ్రాయెల్.. 1948 మే 14న స్వాతంత్ర్యం పొందింది. అతి చిన్న దేశాల్లో ఒకటైతే.. ఉత్తరాన లెబనాన్, తూర్పున జోర్డాన్, ఈశాన్యాన సిరియా, నైరుతిలో ఈజిప్టు, పక్కనే గాజా, వెస్ట్ బ్యాంక్ ఉంటాయి. టెక్నాలజీ, సైన్స్, సైబర్, వ్యవసాయంలో అబ్బురపరిచే ఆ దేశం.. ఒకేసారి 9 దేశాలు యుద్ధం చేసినా ఓడిపోలేదు. పాల ఉత్పత్తిలో నంబర్ వన్. దీన్ని చూసి పెద్ద పెద్ద దేశాలే జంకుతుంటాయి. స్వాతంత్ర్యం వచ్చి 24 గంటలు కాకముందే 9 దేశాలు దాడి చేశాయి. జనాభా అప్పుడు 5 లక్షలైతే, 9 దేశాల జనాభా 6 కోట్లు. https://justpostnews.com
ఆ తర్వాత 7 సార్లు జరిగిన యుద్ధాల్లోనూ అపజయమే లేదు. గత 30 ఏళ్లుగా పాలస్తీనా నుంచే 150కి పైగా దాడులు జరిగాయి. ప్రపంచ కుబేరుల్లో చాలామందికి ఇజ్రాయెల్ తో సంబంధం ఉందంటారు. అక్కడ పుట్టడమో, అక్కణ్నుంచి వెళ్లి అమెరికా, యూరప్ లో సెటిలవడమో జరిగాయంటారు. అమెరికాలో ప్రతి 10 వేల మందికి 85, జపాన్ లో 83 మంది సైంటిస్టులుంటే ఇజ్రాయెల్ లో ఆ సంఖ్య 140. అక్కడి బడ్జెట్లో మూడో వంతు విద్యపైనే వెచ్చిస్తారు.