మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.5 నుంచి 8.2గా నమోదైంది. దక్షిణ అమెరికాలోని అంటార్కిటికా(Antarctica)కు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(USGS) తెలిపింది. ఈ ప్రభావంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అట్లాంటిక్ మహాసముద్రానికి నైరుతిలో, పసిఫిక్ మహాసముద్రానికి ఆగ్నేయ దిక్కున సునామీ ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. జులై 30న 8.8తో వచ్చిన భూకంపం రష్యా, జపాన్ సహా పలు దేశాల్ని కుదిపేసింది. https://justpostnews.com