
ఉగాండా వాసి మూసా హసాయా కసేరా(72) కుటుంబం ప్రపంచంలోనే అతిపెద్దది. 12 మంది భార్యల ద్వారా 120 మంది పిల్లలు.. అలా 3, 4 తరాల సంఖ్య 800కు చేరింది. ఇప్పటికీ 100 ఎకరాల్లో అంతా కలిసే ఉంటారు. 1972లో మొదటి పెళ్లి జరగ్గా.. బంధువులు, ఊర్లోని వ్యక్తులే పిల్లనిచ్చారు. కొన్ని మతాల్లో బహుభార్యత్వం అక్కడ చట్టబద్ధం. ఆ పేర్లు గుర్తుంచుకోవడం కూడా ఆయనకు కష్టమే. అందర్నీ పోషించడానికి చాలా కష్టపడ్డారట. అందర్నీ పోషించడానికి చాలా కష్టపడ్డారట. కొంతమంది భార్యలు విడిచి వెళ్లిపోయారు. రైతు అయిన హసాయా ఆ వందెకరాల్లోనే వివిధ రకాల పంటలు పండిస్తారు. ఆయన పిల్లల వయసు ఒకరికి 50 ఏళ్లుంటే, మరొకరికి పదేళ్లు ఉంటాయి. ఈయన కుమారుల కన్నా మనవల వయసే పెద్దగా ఉంటుంది.