
మొన్న లక్నోపై 47 బంతుల్లోనే 70 పరుగులు చేసిన సమీర్ రిజ్వీ.. ఇవాళ సైతం రెచ్చిపోవడంతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. తొలుత సూర్య(51) ఒంటరిపోరుతో ముంబయి ఇండియన్స్ 162/6 స్కోరు చేసింది. రాహుల్(1) మళ్లీ నిరాశపరిచినా, నిశాంక(44) అండతో రిజ్వీ(90; 51 బంతుల్లో 7×4 7×6) ఫటాఫట్ ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో సెంచరీ కోల్పోయినా అప్పటికే గెలుపు ఖాయం చేశాడు. ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబయిపై ఘనంగా గెలిచింది. ఢిల్లీ వరుసగా రెండు మ్యాచులు గెలిస్తే ఆ రెండింటినీ సమీర్ రిజ్వీయే ముందుకు నడిపించాడు.